తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంతర్జాతీయ విమానాల రద్దు గడువు పొడిగింపు - డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్

అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డీజీసీఏ మరోసారి పొడిగించింది. కార్గో విమానాలు, ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది.

Extension of cancellation of international flights
అంతర్జాతీయ విమానాల రద్దు గడువు పొడిగింపు

By

Published : Jan 28, 2021, 8:28 PM IST

అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.

కార్గో విమానాలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు మాత్రం ఈ షరతులు వర్తించవని స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్‌ కుమార్‌ గురువారం సాయంత్రం సర్క్యులర్‌ జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.

ఇదీ చూడండి:'హింసను ప్రేరేపించే వార్తా ప్రసారాలపై చర్యలేవి?'

ABOUT THE AUTHOR

...view details