ఒడిశాలోని భువనేశ్వర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్‌భవన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు మూడు అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి.
రాజ్‌భవన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం - ఒడిశా రాజ్‌భవన్‌లో అగ్నిప్రమాదం
ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్‌లో రాజ్‌భవన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.
ఒడిశా: రాజ్‌భవన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
పెట్రోల్ బంకులోని ఇంధనం నిల్వ ఉన్న రెండు ట్యాంకుల్లో.. ఒకటి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి చెప్పారు.