అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ చెన్నైకి చేరుకున్నారు. శశికళకు చెన్నైలో అడుగడుగున ఘన స్వాగతం పలికారు ఏఎంఎంకే నేతలు, అభిమానులు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు నుంచి దారిపొడవునా బ్యానర్లు కట్టి ఆహ్వానించారు.
చెన్నైకి చేరుకున్న శశికళ- 'ఏఎంఎంకే' ఘన స్వాగతం - శశికళ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు నుంచి చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఘన స్వాగతం పలికారు ఏఎంఎంకే నేతలు, అభిమానులు.
![చెన్నైకి చేరుకున్న శశికళ- 'ఏఎంఎంకే' ఘన స్వాగతం Expelled AIADMK leader VK Sasikala leaves for Tamil Nadu from Bangaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10540655-thumbnail-3x2-shasikala.jpg)
చెన్నైకు శశికళ- భారీగా స్వాగత ఏర్పాట్లు
రామవరం ఎస్టేట్ నుంచి ఎంజీఆర్ నివాసానికి వెళ్లనున్నారు శశికళ. ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం చెన్నై హబీబుల్లా రోడ్‌లోని ఇంటికి వెళ్లనున్నారు. జయలలిత స్మారక మందిరం సందర్శించేందుకు అనుమతి లభించలేదు. దీంతో మంగళవారం.. స్మారక మందిరం సందర్శించాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:'చిన్నమ్మ వస్తే తమిళనాడులో అల్లర్లే'
Last Updated : Feb 8, 2021, 12:15 PM IST