ఎన్నికలు ముగిశాక... ఫలితాలు వచ్చే వరకు నాయకులకు కంటి మీద కునుకు ఉండదు. అత్యధికులు ఎగ్జిట్ పోల్స్‌పై ఎనలేని విశ్వసనీయత కనబరుస్తారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు ఓటరు నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి.
మహారాష్ట్ర, హరియాణా విధాన సభ ఎన్నికలు ముగిశాయి. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడిని పట్టాయి. భాజపాకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించాయి. మహారాష్ట్రలో మెజార్టీకి అవసరమైన 145 స్థానాలు... కమలదళమే సొంతంగా గెల్చుకుంటుందని అంచనా వేశాయి సర్వే సంస్థలు.
ఇదీ చూడండి:'మహా'పోరు: భాజపా-శివసేన కూటమి విజయదుందుభి!
హరియాణాలోనూ భాజపాకు మూడింట రెండొంతులకుపైగా స్థానాలు దక్కొచ్చని... కాంగ్రెస్‌కు ఘోరపరాభవం తప్పదని తేల్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సార్వత్రికం సహా... అంతకుముందు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలించాయా...? బోల్తాపడ్డాయా...? అనేది చూద్దాం.
2019 సార్వత్రికంలో అంచనాలకు మించి...
2019 సాధారణ ఎన్నికలు ముగిసిన రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. రెండోసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోమారు అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి పలు సర్వే సంస్థలు. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్, నేత న్యూస్ ఎక్స్ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ చెప్పగా, న్యూస్ ఎక్స్ 242 వస్తాయని తెలిపింది.
అయితే... భాజపా ఇంకా అంచనాలకు మించి అధిక స్థానాలతో సొంతంగానే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 కంటే 21 సీట్లు అధికంగా గెలిచి భాజపానే ఆధిపత్యం చెలాయించింది. యూపీఏ 90 సీట్లకే పరిమితమైంది.
2014 ఎగ్జిట్ పోల్స్
2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించగా అందులో న్యూస్-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏకి 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.
ఎగ్జిట్ పోల్స్ | ఎన్డీఏ | యూపీఏ |
న్యూస్ 24 చాణక్య | 340 | 70 |
ఇండియా టీవీ-సీ ఓటర్ | 289 | 101 |
సీఎన్ఎన్-ఐబీఎన్ సీఎస్డీఎస్ | 280 | 97 |
ఎన్డీటీవీ | 279 | 103 |
టైమ్స్ నౌ-ఓఆర్జీ | 249 | 148 |
2004, 2009 విఫలం