బాబ్రీ మసీదు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రత్యేక కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధమని స్పష్టంచేశారు కేంద్ర మాజీ మంత్రి, ఈ కేసు నిందితుల్లో ఒకరైన ఉమా భారతి. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
బాబ్రీ కేసులో కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటా: ఉమాభారతి
బాబ్రీ మసీదు కేసులో సెప్టెంబర్ 30న తీర్పు వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా స్వీకరించేందుకు సిద్ధమని ప్రకటించారు కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
బాబ్రీ మసీదు కేసులో కొద్ది రోజుల క్రితమే 32 మంది నిందితుల వాంగ్మూలాలను నమోదు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. వాంగ్మూలం తీసుకున్నవారిలో మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ, భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్, ఉమా భారతి వంటి ప్రముఖులు ఉన్నారు. విచారణ ప్రక్రియ పూర్తయిన క్రమంలో కేసులో తీర్పు వెల్లడించేందుకు సెప్టెంబర్ 30వ తేదీని ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో ఆగస్టు 31లోపు తీర్పు వెలువరించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించగా.. సీబీఐ వినతి మేరకు పొడిగించింది.
ఇదీ చూడండి: ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు
TAGGED:
Babri Masjid demolition case