తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుటెర్రస్​ సలహా బృందంలో ఒడిశా యువతి

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​ యువ సలహా బృందంలో ఒడిశాకు చెందిన యువతికి చోటు లభించింది. పర్యావరణ ఉద్యమకారిణి అర్చనా సోరెంగ్​ ఏడుగురు సభ్యుల బృందంలో ఒకరిగా ఎంపికయ్యారు. వాతావరణ సమస్యలు, వాటి పరిష్కారాలపై గుటెర్రస్​కు నేరుగా సలహాలు ఇవ్వగలరు ఈ బృంద సభ్యులు.

UN Chief to Advisory Group
అర్చనా సోరెంగ్​

By

Published : Jul 30, 2020, 1:53 PM IST

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​ నూతన యువ సలహాదారుల బృందంలో భారతీయురాలికి చోటు దక్కింది. ఒడిశాకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి అర్చనా సోరెంగ్ ఈ గౌరవాన్ని పొందారు.

సోరెంగ్​ సహా ఈ బృందంలో ఏడుగురు సభ్యులు ఉంటారు. వీరంతా 18-28 మధ్య వయసు వారు. సోరెంగ్ వయసు 24 ఏళ్లు. వాతావరణ సమస్యలపై పరిష్కారాలు, అవలంబించాల్సిన విధానాలపై గుటెర్రస్​కు ఈ బృందం ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంది.

"సోరెంగ్ పరిశోధనల్లో అనుభవజ్ఞురాలు. ఆమె స్థానిక సమాజాల సంప్రదాయాలు, సాంస్కృతిక పద్ధతులకు ప్రోత్సాహం, సంరక్షణతోపాటు వాటి చరిత్రకు లిఖిత రూపం కల్పించేందుకు కృషి చేస్తున్నారు."

- ఐరాస ప్రకటన

బృందంలో సభ్యులు..

వాతావరణ సమస్యలకు సంబంధించి ఈ బృందానికి నిర్భయంగా, నిర్మొహమాటంగా సలహాలు ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ బృందంలో నిస్రీన్​ ఎల్​సైమ్​ (సుడాన్​), ఎర్నెట్స్ గిబ్సన్​ (ఫిజి), వ్లాదిస్లావ్​ కైయిమ్​ (మాల్డోవా), సోఫియా కియాన్నీ (అమెరికా), నాథన్​ మెటినియర్ (ఫ్రాన్స్​), పాలొమా కోస్టా (బ్రెజిల్) ఉన్నారు.

ఆ సదస్సుతో..

గతేడాది జరిగిన యువత పర్యావరణ సదస్సు నేపథ్యంలో ఈ బృందం ఏర్పాటుకు బీజం పడింది. ఆ సదస్సులో 140 దేశాల నుంచి 1000 మంది పర్యావరణ ఉద్యమకారులు పాల్గొన్నారు. గుటెర్రస్​ 2018 సెప్టెంబర్​లో ప్రారంభించిన ఐరాస యువవ్యూహంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించారు.

ఇదీ చూడండి:విద్యా విధానంలో చేసిన నూతన సవరణలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details