గుజరాత్లో ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)యేనని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు సోదర సంస్థల్లాంటివని విమర్శించారు. అందువల్ల మూడో ప్రత్యామ్నాయం తామేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో.. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ.. ఇంతవరకు గుజరాత్ ప్రజలు రెండు పార్టీలనే చూశారని, ఇప్పుడు తమ రాకతో ప్రజల్లో ఉత్సాహం నెలకొందన్నారు. గాలి మార్పు కనిపిస్తోందని చెప్పారు.
'గుజరాత్లో 'ఆప్' మూడో ప్రత్యామ్నాయం'
గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. భాజపా, కాంగ్రెస్‌లు సోదర పార్టీలని విమర్శించిన ఆయన.. గుజరాత్‌కు 'ఆప్' రూపంలో మరో ప్రత్యామ్నయం లభించిందన్నారు. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'కు ప్రత్యేక ఇంటర్వ్య ఇచ్చారు సిసోడియా.
'గుజరాత్లో 'ఆప్' మూడో ప్రత్యామ్నయం'
25 ఏళ్ల భాజపా పాలనలో మంచి ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు లేవని విమర్శించారు సిసోడియా. భాజపా ఇవ్వలేని పాలనను దిల్లీలో చేసి చూపిస్తున్నామని.. అందుకే ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు. వైద్యశాలలు, పాఠశాలల రూపురేఖలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పూర్తిగా మార్చివేశారని అన్నారు. తాము విజయం సాధిస్తే.. గుజరాత్‌లోనూ ఈ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఇదీ చదవండి:ఆధిపత్యం కోసం మిడిసిపాటు.. మొదటికే చేటు!
Last Updated : Feb 7, 2021, 10:12 AM IST