రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ), రాష్ట్ర పోలీసుల వైఖరిని చూసి బంగాల్ ప్రజలు సిగ్గుపడుతున్నారని భాజపా సీనియర్ నాయకుడు కైలాస్ విజయవర్గీయ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి వెనుక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకమన్నారు.
'అంఫన్ నిధుల్లో అక్రమాలు'
అంఫన్ బాధితుల సహాయార్థం కేంద్రం అందించిన నిధులు.. మత్స్యకారులకు అందాయా?లేదా? అనే విషయాన్ని అడగడానికి వెళ్తున్న నడ్డా కాన్వాయ్‌పై పక్కా ప్రణాళికతోనే మమత ఈ దాడి చేయించారని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయవర్గీయ పేర్కొన్నారు. అంఫన్ తుపాను బాధితులకు కేంద్రం రూ.2,200 కోట్ల నిధులు కేటాయించిందన్న కైలాస్.. పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. "ఆ డబ్బు బాధితులకు అందలేదు. టీఎంసీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లింది. ఆ నిధులపై పంపిణీపై హైకోర్టు కూడా నివేదిక కోరింది" అని కైలాస్ చెప్పారు.