తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2020, 2:08 PM IST

ETV Bharat / bharat

'హ్యాండ్​ శానిటైజర్లు అతిగా వాడితే ఏటా కోటి మంది బలి'

కొవిడ్ నేపథ్యంలో హ్యాండ్​ శానిటైజర్లను అతిగా వినియోగించడంపై తీవ్ర హెచ్చరికలు చేసింది ఎయిమ్స్​. 2050 నాటికి వ్యాధికారక సూక్ష్మజీవులపై ఔషధాల ప్రభావం తగ్గిపోతుందని వెల్లడించింది. దీంతో ఏటా కోటి మందికి ప్రమాదముందని అంచనా వేసింది.

Excessive use of hand-sanitisers may boost antimicrobial resistance, warns AIIMS
హ్యాండ్​ శానీటైజర్ల అతిగా వాడితే.. ఏటా 10 కోట్ల మంది బలి!

కరోనా వల్ల హ్యాండ్​ శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే వీటిని అతిగా వాడటం వల్ల భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని ఎయిమ్స్​ వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. యాంటీమైక్రోబియల్​ నిరోధకత సామర్థ్యం పెరిగి... వ్యాధికారక సూక్ష్మజీవులపై ఔషధాల ప్రభావం తగ్గిపోతుందని వెల్లడించింది.

ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఔషధాలు పని చేయక... ఏటా కోటి మంది ప్రమాదంలో పడతారని ఎయిమ్స్​ తెలిపింది. ఎయిమ్స్​, అమెరికా సొసైటీ ఫర్​ మైక్రోబయాలజీ... యాంటీబయోటిక్స్​ నిరోధకతపై సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్​లో​ పలు కీలక అంశాలను చర్చించారు. ఎయిమ్స్​ మైక్రోబయాలజీ విభాగ అధిపతి డాక్టర్​ రామచౌదరి ఈ వెబినార్​కు అధ్యక్షత వహించారు.

"పెరుగుతున్న ఔషధ వినియోగాన్ని అదుపు చేయకపోతే... 2050 నాటికి ప్రతి ఏడాది కోటి మంది ప్రమాదంలో పడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా వినియోగిస్తున్న హ్యాండ్​ శానిటైజర్లు వల్ల భవిష్యత్తులో పరిస్థితులు మరీ దారుణంగా మారతాయి."

- వైద్య నిపుణులు

ప్రపంచదేశాల్లో కొవిడ్​ విస్తరణ, యాంటీమైక్రోబియాల్​ నిరోధకతతో పాటు వైద్య మౌలిక సదుపాయాలపై వైరస్​ ప్రభావం గురించి చర్చించారు. అనేక అంటువ్యాధులు నివారించడంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీమైక్రోబియాల్స్‌ విఫలమవుతున్నాయని తెలిపారు. దీని వల్ల యాంటీబయోటిక్​- రెసిస్టెంట్​ జీవులు.. వాతావరణంలో మరింత కఠినంగా స్థిరపడ్డాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:హ్యాండ్ శానిటైజర్​ ఇలా ఉంటేనే బెస్ట్!

ABOUT THE AUTHOR

...view details