గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ' (ఐక్యతా విగ్రహం) 100 గొప్ప ప్రదేశాల్లో చోటు దక్కించుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ 2019 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అందులో గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చోటు దక్కించుకోవడం విశేషం.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఐక్యతా విగ్రహాన్ని అందరూ సందర్శించాలని పిలుపునిచ్చారు.
"స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే 100గొప్ప ప్రదేశాల్లో చోటు దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజులక్రితం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని ఒక్క రోజులోనే 31వేల మంది సందర్శించారు." - ట్విట్టర్లో ప్రధాని మోదీ