మధ్యప్రదేశ్ రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తక్షణమే బలపరీక్ష నిర్వహించే విధంగా కమల్నాథ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యం దాఖలైంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా అగ్రనేత శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ను వీడాలన్న సంచలన నిర్ణయంతో కమల్నాథ్ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయే పరిస్థితిలో పడింది. ఈ నేపథ్యంలోనే సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశించారు.
గవర్నర్ ఆదేశాలను పట్టించుకోకుండా.. స్పీకర్ సభను ఈ నెల 26వరకు వాయిదావేశారని పిటిషన్లో పేర్కొన్నారు భాజపా నేత.