విధి నిర్వహణలో భాగంగా పాస్ అడిగినందుకు.. పోలీసులతో గొడవకు దిగారు ఓ మాజీ ఎంపీ. నన్నే పాస్ అడుగుతావా అంటూ దాడి చేశారు. అంతే కాదు, కాలుతో తన్నేందుకు వెనుకాడలేదు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లా సమీలంలోని ఓమల్పుర్ టోల్గేట్ వద్ద జరిగింది.
టోల్గేట్ వద్ద మాజీ ఎంపీ వీరంగం.. పోలీసులపై దాడి! - Arjunan abuses cops
తమిళనాడు సేలం జిల్లాలో పాస్ అడిగినందుకు పోలీసులతో గొడవ పెట్టుకుని, దాడి చేశారు ఏఐఏడీఎంకే నేత, మాజీ ఎంపీ. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో జిల్లాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈ-పాస్లు ఉంటేనే అనుమతిస్తున్నారు.
తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలు విధించారు అధికారులు. లాక్డౌన్ నిబంధనల మేరకు ఈ-పాస్లు ఉంటేనే నగరంలోకి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో సేలం నగరంలోకి వచ్చే వారిని ఓమల్పుర్ టోల్గేట్ వద్ద తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఓమల్పుర్ నుంచి సేలం నగరంలోకి వస్తోన్న ఏఐఏడీఏంకే సభ్యుడు, మాజీ ఎంపీ అర్జునన్ కారును అడ్డుకున్నారు పోలీసులు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ-పాస్, గుర్తింపు కార్డు చూపించాలని కోరారు. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ ఎంపీ అర్జునన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసభ్యపదజాలంతో దూషించి.. కాలుతో తన్నారు.
అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే.. విధుల్లో ఉన్న పోలీసులతో గొడవకు దిగినప్పటికీ.. ఆ నాయకుడిపై ఇప్పటి వరకు కేసు నమోదు కాకపోవటం గమనార్హం.