అసోంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటి నుంచే రాజకీయంగా వేడి రాజుకుంటోంది. అధికార భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించింది కాంగ్రెస్. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి పోటీ చేస్తారని పేర్కొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయి. ఈ విషయంపై తనకు సమాచారం ఉన్నట్లు తెలిపారు.
"ముఖ్యమంత్రి పదవికి భాజపా అభ్యర్థుల జాబితాలో సీజేఐ రంజన్ గొగొయి పేరు ఉన్నట్లు తెలిసింది. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని నేను అనుమానిస్తున్నా. జస్టిస్ రంజన్ గొగొయి.. మానవ హక్కుల కమిషన్ లేదా ఇతర కమిషన్లకు సులభంగా ఛైర్మన్ అయి ఉండేవారు. కానీ రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరికతోనే రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించారు. అయోధ్య కేసు తీర్పులో జస్టిస్ రంజన్ గొగొయి ఉండటం వల్ల భాజపా సంతోషపడింది. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని జస్టిస్ గొగొయి అంగీకరించినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు."
- తరుణ్ గొగొయి, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఖండించిన భాజపా..