ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో శాసనసభ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో భద్రతా సిబ్బంది, పారా మిలిటరీ బలగాలను మోహరించింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్లు ఉపయోగిస్తోంది ఈసీ.
ఒడిశా...
విధానసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరగనుంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్ జరగనుంది.
మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్సభ, అసెంబ్లీ సెగ్మెంట్లు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించారు.