జీవి మనుగడ కోసం తిండి చాలా అవసరం. ఆకలేసినా, వేయకపోయినా ఆరోగ్యంపై శ్రద్ధవహిస్తూ సమయానికి ఏదో ఒకటి తింటుంటారు చాలా మంది. ఏమీ తినకుండా ఒకరోజు.. మహా అయితే రెండు రోజులు ఉండొచ్చు. కానీ, కర్ణాటకకు చెందిన శ్రీశైల మాత్రం 16 ఏళ్ల నుంచి అసలు ఆహారమే లేకుండా.. కేవలం 'టీ'తో జీవనం సాగిస్తున్నాడు.
బెల్గాం జిల్లా నగనూరులో నివాసముండే 36 ఏళ్ల శ్రీశైల.. తన 20 ఏళ్ల వయస్సు నుంచి ఆహారం తీసుకోవడమే మానేశాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనుల్లో నిమగ్నమయ్యే ఈ రైతు.. పూటకు ఓ కప్పు టీ తీసుకొని మిగతావారిలాగే అన్ని పనులు చేస్తుంటాడు.