దేవుడు కూడా ఆశావాహులందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేడని పేర్కొన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వయంపూర్ణ మిత్ర' కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పంచాయతీ ప్రతినిధులతో నిర్వహించిన వెబినార్లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
" దేవుడు ముఖ్యమంత్రి అయినా, ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు. వారి (నిరుద్యోగులు) గృహాల్లో కూడా నెలకు రూ.8000 నుంచి రూ.10,000 ఆదాయం ఉండాలి. గోవాలో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వాటిని బయటి వారు లాక్కెళుతున్నారు. గ్రామీణ నిరుద్యోగులకు చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కల్పించటంలో స్వయంపూర్ణ మిత్ర దోహదపడుతుంది."
- ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి.