తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర రవాణాశాఖ మంత్రికే తప్పని ట్రాఫిక్​ చలానా! - modi 100 days

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కఠిన నిబంధనలు తప్పనిసరిగా అవసరమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ పునరుద్ఘాటించారు. వాహనాన్ని వేగంగా నడిపినందుకు ఆయనకు కూడా జరిమానా పడిందని గుర్తుచేసుకున్నారు గడ్కరీ.

నితిన్​ గడ్కరీ

By

Published : Sep 9, 2019, 7:11 PM IST

Updated : Sep 30, 2019, 12:53 AM IST

రహదారులపై ప్రమాదాలు జరగకూడదంటే వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. అందుకే కఠిన నిబంధనలు, భారీ జరిమానాలు విధించామని ఆయన తెలిపారు.

"మోటారు వాహనాల చట్టానికి ఆమోదం లభించటం గొప్ప విజయంగా భావిస్తున్నాం. ప్రజల సాఫీ ప్రయాణమే లక్ష్యంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం. ముంబయిలో బాంద్రా- వర్లీ రహదారిలో పరిమితికి మించిన వేగంతో వెళ్లినందుకు గతంలో నేను కూడా జరిమానా కట్టాను."

- నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

100 రోజుల్లో మోదీ విజయాలు

గడిచిన 100 రోజుల్లో మోదీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు గడ్కరీ. ముమ్మార్​ తలాక్, ఆర్టికల్​ 370 రద్దు, మోటార్​ వాహనాల చట్టం సవరణ బిల్లు, జాతీయ వైద్య బిల్లుతోపాటు చాలా కీలక బిల్లులకు చట్టరూపం ఇచ్చామన్నారు. ఇది మోదీ విజయమని పేర్కొన్నారు. భారత్​ని ప్రపంచ ఆర్థిక శక్తిగా​ మార్చటమే ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: 'మోదీ వల్లే శాస్త్రవేత్తలు తిరిగి పని ప్రారంభించారు'

Last Updated : Sep 30, 2019, 12:53 AM IST

ABOUT THE AUTHOR

...view details