ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దిల్లీలోని ప్రధాని నివాసం వద్ద చౌకీదార్ అని పిలిస్తే అక్కడున్న కాపలాదార్లు, భద్రతా సిబ్బంది వెంటనే 'చోర్ హై' అని బదులిస్తారని అన్నారు. మధ్యప్రదేశ్ దమోహ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. 15మంది ధనికులకు మోదీ రూ.5లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. అందుకే 'చౌకీదార్ చోర్' అంటున్నారని దుయ్యబట్టారు. రఫేల్ కుంభకోణం ద్వారా అనిల్ అంబానీకి మోదీ రూ.30వేల కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు రాహుల్ గాంధీ.
'మోదీని ఆయన కాపలాదారులే 'చోర్' అంటారు' - chowkidar
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోదీ నివాసం వద్దకు వెళ్లి 'చౌకీదార్' అని పిలిస్తే అక్కడున్న సిబ్బంది వెంటనే 'చోర్ హై' అని బదులిస్తారని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ దమోహ్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు రాహుల్.
మోదీని ఆయన కాపలాదారులే చోర్ అంటారు:రాహుల్
మధ్యప్రదేశ్‌లో భాజపా అధికారంలో ఉన్నపుడు జరిగిన రూ.3వేల800కోట్ల బుందేల్‌ఖండ్ ప్యాకేజి కుంభకోణంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు సూచించారు రాహుల్ గాంధీ.
ఇదీ చూడండి: మోదీ నామినేషన్ రద్దు చేయండి: టీఎంసీ