తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కశ్మీర్​కు ఈయూ ఎంపీలు.. ప్రతిపక్షాల విమర్శలు - congress latest news

జమ్ము-కశ్మీర్​లో పరిస్థితులపై ఆరా తీసేందుకు ఐరోపా సమాఖ్యకు చెందిన 27 మంది ఎంపీలు ఆ రాష్ట్రంలో ఇవాళ పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్​లో ఓ అంతర్జాతీయ బృందం పర్యటిస్తోంది. విపక్ష పార్టీలకు చెందిన నేతలను కశ్మీర్​లోకి వెళ్లనీయకుండా.. విదేశీ ప్రజాప్రతినిధులను అనుమతిస్తున్నారని కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

నేడు కశ్మీర్​కు ఈయూ ఎంపీలు

By

Published : Oct 29, 2019, 5:01 AM IST

Updated : Oct 29, 2019, 7:30 AM IST

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. ఐరోపా సమాఖ్యలోని 9 దేశాలకు చెందిన 27 మంది పార్లమెంటు సభ్యులు ఇవాళ జమ్ము-కశ్మీర్​కు వెళ్తున్నారు.

కశ్మీర్​ లోయలో పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పదేపదే పాకిస్థాన్​ నిందిస్తున్న వేళ.. అక్కడి వాస్తవ పరిస్థితులపై ఆరా తీసేందుకు ఈ 27 మందిని తీసుకురావడం ద్వారా భారత్ దౌత్యపరంగా పెద్దవిజయమే సాధించింది. వారికి కశ్మీర్​లో వాస్తవ పరిస్థితులు చూపించడం ద్వారా పాక్​ను ఎండగట్టాలని భావిస్తోంది.

నిన్ననే దిల్లీకి వచ్చిన ఎంఈపీ సభ్యులు... ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​తో విడివిడిగా భేటీ అయ్యారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపట్ల త్వరితగతిన చర్యలుండాలంటూ పరోక్షంగా పాక్​ను ఉద్దేశించి ఎంఈపీ సభ్యులతో మోదీ అన్నారు. వివిధ దేశాలకు చెందిన వీరి పర్యటన ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల గురించి వారికి అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వాల ప్రాథమ్యాలు ఏంటన్నది వారికి కూడా తెలుస్తుందన్నారు మోదీ.

కశ్మీర్​లో ఈయూ ఎంపీల పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంపై ధ్వజమెత్తాయి.

'భారత పార్లమెంటుకు అవమానం'

స్వదేశీ ఎంపీలను కశ్మీర్​కు వెళ్లకుండా అడ్డుకున్న మోదీ సర్కారు.. విదేశీయులకు మాత్రం ఎర్రతివాచీ పరిచి.. వారితో పర్యవేక్షిత పర్యటన చేయిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఇది సరికాదని పూర్తిగా మన రాజ్యాంగానికి, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే చర్య అని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

ఈ పర్యటనకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అనుమతి ఇవ్వడం పూర్తిగా మన విదేశీ విధానానికి విరుద్ధమని భాజపా ఎంపీ సుబ్రమణ్యం ట్వీట్​ చేశారు.

వాస్తవాలు తెలుస్తాయి..

ఎంఈపీ సభ్యుల రాకతో అయినా ఇక్కడి వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలిసేందుకు అవకాశం ఏర్పడిందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.

గతంలో అమెరికా సెనేటర్లు కొందరు జమ్ముకశ్మీర్లో పర్యటించి.. వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటామని కోరారు. భారత్ వారి విజ్ఞప్తిని ఎందుకు తోసిపుచ్చిందని వాపోయారు ముప్తీ.

గృహ నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను ఈయూ ఎంపీలు ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు.

Last Updated : Oct 29, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details