తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపిన రామ్​చరణ్​

ఈటీవీ భారత్​ చొరవతో ఛత్తీస్​గఢ్​లోని ఓ కుటుంబానికి ఆవాసం లభించింది. మూడేళ్లుగా అడవిలో నివసిస్తున్న రామ్​చరణ్ కుటుంబానికి​ అక్కడి ప్రభుత్వం భూమిని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు కారణమైన ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు రామ్​చరణ్​.

ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపిన రామ్​చరణ్​

By

Published : Sep 29, 2019, 2:05 PM IST

Updated : Oct 2, 2019, 11:02 AM IST

ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపిన రామ్​చరణ్​

సుమారు రెండు దశాబ్దాల క్రితం మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. విభజనతో ఛత్తీస్​గఢ్ ప్రాంత​ ప్రజలు సమస్యలను అధిగమిస్తారని అంతా భావించారు. అయితే ఇక్కడి పూర్వాంచల్ ప్రాంత ప్రజల జీవనశైలి మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ ఇక్కడి గిరిజన ప్రజలు రేకు, టార్పాలిన్​ల సాయంతో అడవుల్లో నివసిస్తున్నారు.

అయితే ఈటీవీ భారత్​ చొరవతో కొరియా జిల్లాలోని రామ్​చరణ్​ కుటుంబానికి ఆవాసం లభించింది. ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన ప్రభుత్వం భూమిని ఇచ్చి.. ప్రధానమంత్రి ఆవాస్​​ యోజన కింద ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. తనకు సాయం చేసిన ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపాడు రామ్​ చరణ్.

"అడవిలో నివసిస్తున్న నాకు గ్రామంలో ఆవాసం కల్పిస్తున్నారు. నా సమస్యను అధికారుల వరకు తీసుకెళ్లినందుకే నాకు ఈ ఉపకారం జరిగింది. అందుకే మీకు (ఈటీవీ భారత్​కు) మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను." -రామ్​చరణ్​

సల్గావకాలలో నివసిస్తున్నారు రామ్​చరణ్​. కుటుంబానికి సంబంధించిన భూమి వివాదంలో ఉంది. ఈ కారణంగా మూడేళ్లుగా అడవిలోనే జీవనం సాగిస్తున్నాడు రామ్​చరణ్​. ఈ విషయాన్ని ఈటీవీ భారత్​ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ కథనానికి స్పందించిన భరత్​పుర్​ ఎమ్మెల్యే గులాబ్ కమ్రో.. ప్రభుత్వం నుంచి రామ్​చరణ్​కు భూమిని కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:వరదల్లో విద్యార్థుల ట్రక్ బోల్తా- అంతా సురక్షితం

Last Updated : Oct 2, 2019, 11:02 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details