'గ్రీన్మ్యాన్'గా సుపరిచితుడైన రోహిత్ మెహ్రా దేశవ్యాప్తంగా 75 హరితప్రాంతాలు అభివృద్ధి చేశాడు. తను తీర్చిదిద్దే ప్రతివనంలో 600 నుంచి 700 వరకు చెట్లు ఉంటాయి. అలా దేశం నలుమూలలా ఇప్పటి వరకు 8లక్షల మొక్కలు నాటాడు.
లూధియానాలో పన్నుల విభాగం సంయుక్త సంచాలకుడిగా పనిచేస్తున్న రోహిత్ మెహ్రా... వృత్తిపరంగా ఎంత ఒత్తిడిలో ఉన్నా పర్యావరణంపై మక్కువ వదులుకోలేదు. నాలుగేళ్లుగా వ్యక్తిగతంగానే మొక్కలు నాటుతున్నాడాయన. పంజాబ్లోని అన్నిజిల్లాల్లో హరితప్రాంతాలు, సూరత్, బరోడా, ముంబయి, దిల్లీల్లో చిట్టడవులు అభివృద్ధి చేశాడు.
గ్రీన్బెల్ట్లతో..
అయిదు రకాల చెట్లతో గ్రీన్బెల్ట్లను అభివృద్ధి చేస్తున్నాడు రోహిత్ మెహ్రా. ఉత్తరాది నుంచి బిల్వ, దక్షిణాది నుంచి రాచ ఉసిరి, ఆగ్నేయం నుంచి అశోక, తూర్పు నుంచి మర్రి, పశ్చిమం నుంచి తెచ్చి రాగి చెట్లను పెంచుతున్నాడు.
"వేర్వేరు జాతుల మొక్కలు కలిపి కొన్ని విభిన్న గ్రీన్బెల్ట్లు కూడా అభివృద్ధి చేశాను. వాటిల్లో ఒకటైన త్రివేణి వనంలో వేప, రాగిచెట్లు చూడొచ్చు . అలానే "నానక్ వనం". వాటితో పాటు 9నక్షత్రాల ఆకారంలో మొక్కలు నాటి నక్షత్రవనాన్ని తీర్చిదిద్దాం. ఇవన్నీ దేశ ప్రాచీన, మనవైన, చారిత్రక పవిత్ర వృక్షాలు. బయట నుంచి తీసుకుని వచ్చిన వృక్షజాతులు అందగా కనిపిస్తాయి. కానీ అవి ఇక్కడ అభివృద్ధి చెందేవి కాదు."
--రోహిత్ మెహ్రా, పర్యావరణ ప్రేమికుడు.
వేగంగా పెరుగుతాయ్..
తాను నాటే మొక్కలు 7 నెలల వ్యవధిలో 10అడుగల వరకు ఎత్తు పెరుగుతాయని చెబుతున్నాడు రోహిత్ మెహ్రా. 3, 4 నెలల్లోనే 80 నుంచి 90 ఎత్తుకు చేరతాయని అంటున్నాడు. నాటేటప్పుడు 2 మొక్కల మధ్య రెండున్నర అడుగుల దూరం పాటిస్తానన్నాడు.