బిహార్ గోపాల్గంజ్ జిల్లాలో వరద బీభత్సంపై వార్తలు సేకరించేందుకు వెళ్లిన ఓ ఈటీవీ రిపోర్టర్ తన సహృదయాన్ని చాటుకున్నాడు. జిల్లాలోని విష్ణుపుర గ్రామం పూర్తిగా నీటమునిగిన నేపథ్యంలో ఛాతీ లోతు ఉన్న నీటిలో ఓ బాలుడిని వీపుపై ఎక్కించుకుని తన స్వగృహానికి తీసుకెళ్లాడు.
క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిపై వార్తలు సేకరించేందుకు వెళ్లిన రిపోర్టర్ అటల్ బిహారీ పాండే ఈ సాహసం చేశాడు.