దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఆ ప్రాంతంలో జరుగుతోన్న జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల ఐదో దశ పోలింగ్‌పై రిపోర్టింగ్ చేస్తుండగా ఈ చర్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో తనతోపాటు నెట్వర్క్ 18 రిపోర్టర్ ముదాసిర్ ఖాద్రీ, పంజాబ్ కేసరి రోపోర్టర్ జునైద్ రఫీఖ్ గాయపడ్డారని ఈటీవీ భారత్ జర్నలిస్టు ఫయాజ్ అహ్మద్ లోలు తెలిపారు.
"తనను ఓటు వేసేందుకు అనుమతించడంలేదని ఆరోపించిన 'పీపుల్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్' స్థానిక అభ్యర్థి బైట్ తీసుకున్నాం. తర్వాత దీనిపై పోలీసుల స్పందన తెలుసుకోవడానికి వెళ్లాం. కానీ, వాళ్లు తిరిగి మాపై దాడి చేశారు. మాకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారు. ఈ ఘటనలో జునైద్ స్పృహ తప్పి పడిపోయాడు".