కర్ణాటక కల్బుర్గి జిల్లా సుర్పూర్ తాలూకాలోని గోగికేరా గ్రామంలో గురుబాయ్ అనే వృద్ధురాలు గత 20 ఏళ్ల నుంచి ఓ చిన్న గుడిసెలోనే నివసిస్తోంది. దాని విస్తీర్ణం 4.5 చదరపు మీటర్లు మాత్రమే. ఆమె పడుతున్న అవస్థను సోమవారం ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది ఈటీవీ భారత్.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఎమ్మెల్యే సాయం - కర్ణాటక కల్బుర్గి జిల్లా సుర్పూర్ తాలూకాలోని గోగికేరా గ్రామం
కర్ణాటకలో ఓ వృద్ధురాలు గత 20 ఏళ్లుగా చిన్న గుడిసెలోనే జీవిస్తుంది. ఆ పరిస్థితి గురించి సోమవారం ఈటీవీ భారత్ ఓ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఆమెకు కొత్త ఇంటిని కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. వృద్ధురాలికి సాయం చేసిన ఎమ్మెల్యే
ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. వృద్ధురాలికి సాయం
ఈ కథనానికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే నరసింహ నాయక్ ఆమె ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు. వెంటనే ఆ వృద్ధురాలికి అదే ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా ఆమెకు నిత్యావసరాలు అందించారు. రెండు రోజుల్లోనే మరొక ఇంటికి తరలించేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
తన వ్యథను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఈటీవీ భారత్ రిపోర్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు గురుబాయ్.