తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హన్సీ ప్రహారికి అండగా  కదిలిన ఉత్తరాఖండ్​ యంత్రాంగం - etv bharat special story on hansi prahari

ఆంగ్లంలో రెండు డిగ్రీలు సంపాదించి ప్రస్తుతం యాచకురాలిగా జీవనం సాగిస్తోన్న ఉత్తరాఖండ్ యువతి హన్సీ ప్రహారిపై 'ఈటీవీ భారత్​'లో వచ్చిన కథనానికి విశేష స్పందన లభించింది. దీనిపై ఉత్తరాఖండ్​ ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించింది. పలువురు ప్రతిపక్ష నేతలు సైతం ఆమెను ఆదుకుంటామంటూ ముందుకొస్తున్నారు.

ETV Bharat impact: Uttarakhand leaders extend hands to help Hansi Prahari
హన్సీ ప్రహారీకి ఉత్తరాఖండ్​ ప్రభుత్వం అండ

By

Published : Oct 20, 2020, 2:47 PM IST

Updated : Oct 20, 2020, 6:58 PM IST

"ఆంగ్లంలో రెండు డిగ్రీలు -ప్రస్తుతం యాచకురాలు"అంటూ 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి భారీ స్పందన లభించింది. ఉత్తరాఖండ్ హరిద్వార్​కు చెందిన హన్సీ ప్రహారిని ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం సహా పలు సేవా సంస్థలు ముందుకొచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వం హామీ..

ఉత్తరాఖండ్​ ప్రభుత్వం వెంటనే హన్సీని ఆదుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆమె వివరాలు సేకరించాల్సిందిగా స్థానిక కలెక్టర్​కు సూచించింది. తరువాత హరిద్వార్​ కలెక్టర్​ సైతం ఆమెను కలిశారు.

హన్సీని, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ఏర్పాట్లు చేస్తామని కేబినెట్​ మంత్రి మదన్ కౌషిక్​ తెలిపారు. హన్సీ ఆరోగ్యానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

"కుంభమేళా ఉత్సవం కంటే ముందే హరిద్వార్​లో ఉన్న యాచకులను గుర్తించి వారికి కేటాయించిన వసతి గృహంలో ఉంచుతాం."

--మదన్​ కౌషిక్​, కేబినెట్​ మంత్రి

హన్సీకి అండగా ఉంటామని ఉత్తరాఖండ్​ స్పీకర్​ ప్రేమ్​ చంద్​ అగర్వాల్​ తెలిపారు.

"ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్థిని ఈరోజు హరిద్వార్​ వీధుల్లో యాచకురాలిగా జీవనం సాగిస్తోంది. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా ఉండాలి "

-- ఇందిరా హృదయేష్​ ,ఉత్తరాఖండ్​ ప్రతిపక్ష నేత

రాజ్యసభ ఎంపీ ప్రదీప్​ టమ్​టా ఈ కథనంపై 'ఈటీవీ భారత్'​తో స్పందించారు.

"నేను అనేక సేవా సంస్థలతో మాట్లాడాను. హన్సీకి కచ్చితంగా సహాయం అందుతుంది. డిగ్రీలు ఉన్నా యాచకురాలిగా మారటం బాధాకరం. ఆమెకు సహాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం."

--ఈటీవీ భారత్​తో రాజ్యసభ ఎంపీ ప్రదీప్​ టమ్​టా.

పరమార్థ నికేతన్​ అండ..

పరమార్థ నికేతన్ ఆశ్రమం పీఠాధిపతి స్వామి చిదానంద సరస్వతి సైతం ఈ కథనంపై స్పందించారు. హన్సీకి ఆశ్రమంలో చోటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఈటీవీ భారత్​లో కథనం చూసిన తరువాత నాకు బాధ కలిగిందని ఉత్తరాఖండ్​ మహిళా శిశు సమృద్ధి శాఖ మంత్రి రేఖ ఆర్యా అన్నారు.

"హన్సీ కథనం చదివిన తరువాత నేను కొంతమందిని ఆమెకు సహాయం చేయటానికి పంపించాను. వారు ఆమెకు ఉపాధిని కల్పిస్తారు. దీంతో ఆమె సంతోషంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి "

--హరీష్​ రావత్, ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి

హన్సీ స్నేహితులు సైతం..

హన్సీకి సాయం చేయడానికి ఆమె స్నేహితులు సైతం కదిలి వచ్చారు. కుమోన్ విశ్వవిద్యాలయం స్నేహితులు ఆమెతో ఫోన్లో సంభాషించారు. దేహ్రాడూన్​ డిప్యూటీ కమిషనర్ భువన్ పాండే సైతం హన్సీతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

హన్సీ ప్రహారి నేపథ్యం..

ఉత్తరాఖండ్​ హరిద్వార్​కు చెందిన హన్సీ ప్రహారి, కుమావూ విశ్వవిద్యాలయంలో రెండుసార్లు ఆంగ్లంలో పట్టభద్రురాలు అయ్యారు. అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. ఆమె గతంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్ టమ్​టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు.

వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయారు హన్సీ. ప్రస్తుతం హరిద్వార్​లోని రైల్వే స్టేషన్, బస్టాండు, గంగా తీరంలోని ఘాట్​లలో భిక్షమెత్తుకుంటున్నారు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి :ఆంగ్లంలో రెండు డిగ్రీలు- ప్రస్తుతం యాచకురాలు!

Last Updated : Oct 20, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details