కర్ణాటకలోని ఆ గ్రామాల్లో సెల్ టవర్ లేక.. ఇంటర్నెట్ సౌకర్యం అసలే అందక.. దాదాపు 400 మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు నానా తంటాలు పడ్డారు. క్లాసులకు హాజరయ్యేందుకు సిగ్నల్ కోసం సమీపంలోని అడవిలో కొండెక్కి టెంట్లు వేశారు. వర్షాకాలం కావడం వల్ల కొండపైన కూర్చోలేక టవర్ పెట్టించాలని అధికారులను డిమాండ్ చేశారు. వారి వెతలను కథనంగా మలచింది ఈటీవీ భారత్. దీంతో వారి సమస్యకు పరిష్కారం దొరికింది.
ఈటీవీ భారత్ లో వెలువడ్డ కథనం ప్రజాప్రతినిధులను స్పందించేలా చేసింది. దీంతో దక్షిణ కర్ణాటకలోని శిబజే గ్రామ పంచాయతీ సహా, పెర్లా, పసోడి, మయార్ది, పట్టిమారు, నిరానా, భండిహోళె, బూడడమక్కి గ్రామాల విద్యార్థుల కష్టాలను తీరిపోయోలా చేసింది.