తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ-భారత్‌ చొరవతో... సంచార రక్తనిధి కేంద్రం - వారణాసి

వారణాసిలోని సర్‌ సుందర్‌లాల్‌ ఆసుపత్రి.. మొబైల్‌ బ్లడ్‌బ్యాంకును ప్రారంభించింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో రక్తం అవసరమైన రోగులకు సకాలంలో అందక శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితిని ఈనెల12న 'ఈటీవీ- భారత్‌' ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఫలితంగా వారణాసిలో సంచార రక్తనిధి కేంద్రం ఏర్పాటైంది.

Establishment of a Mobile Blood Bank in Varanasi with the initiative of ETV BHARAT
వారణాసిలో సంచార రక్తనిధి కేంద్రం

By

Published : Apr 19, 2020, 7:02 AM IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో రక్తం అవసరమైన రోగులకు సకాలంలో అందక శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. రక్తదాతలు సిద్ధంగా ఉన్నా కేంద్రాల వరకు వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితిని ఈనెల12న 'ఈటీవీ- భారత్‌' ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన వారణాసిలోని సర్‌ సుందర్‌లాల్‌ ఆసుపత్రి... మొబైల్‌ బ్లడ్‌బ్యాంకును ప్రారంభించింది. నగరమంతా తిరుగుతూ దాతల నుంచి రక్త సేకరణ ప్రారంభించింది. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పార్టీల నాయకులు సహకరిస్తున్నారు. రక్తదాతలు భౌతిక దూరం పాటిస్తున్నారు. 'ఈటీవీ-భారత్‌' యాప్‌లో కథనం చూశాక తాము మొబైల్‌ బ్లడ్‌బ్యాంకుకు ఫోన్‌ చేసి తమ కాలనీని పిలిపించామని, స్థానికులకు ప్రోత్సహించి రక్తదానం చేయించామని వానప్రస్థ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్‌ రాకేశ్‌ మిద్దా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details