తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త - EMPLOYEES

ఈఎస్​ఐ  పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి  సభ్యత్వ రుసుంను తగ్గించింది కేంద్రం. ఈఎస్​ఐ  చట్టం కింద  వారి నుంచి వసూలు చేసే మొత్తాన్ని 6.5 శాతం నుంచి 4శాతానికి, సభ్యత్వ రుసుంలో ఉద్యోగి  వాటాను 1.74 నుంచి 0.75కి కుదించింది.

ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

By

Published : Jun 13, 2019, 9:51 PM IST

ఈఎస్​ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది. ఈఎస్​ఐ చట్టం కింద ఉద్యోగుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని 6.5 నుంచి 4 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సభ్యత్వ రుసుంలో ఉద్యోగి వాటాను 1.74 నుంచి 0.75కి, యాజమాన్య వాటాను 4.75 నుంచి 3.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

సవరించిన రుసుంలు ఆగస్టు 1నుంచి అమల్లోకి వస్తాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 3 కోట్ల 60 లక్షల మంది ఉద్యోగులు, 12 లక్షల 86 వేల మంది యజమానులకు రూ.5వేల కోట్ల మేర ఆదా కానుంది.

ఇదీ చూడండి: సముద్రంలో జవాన్​ను కాపాడిన తీరప్రాంత దళం

ABOUT THE AUTHOR

...view details