దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన - కాలుష్య నివారణ అథారిటీ (ఈపీసీఏ) ప్యానెల్. దిల్లీని ఆరోగ్య అత్యవసర పరిస్థితి కలిగిన ప్రాంతంగా ప్రకటించింది.
నేటి నుంచి 5వ తేదీ వరకు రాజధానిలో ఎటువంటి భవన నిర్మాణ కార్యకలాపాలు చేపట్టరాదని ఆదేశింది ఈపీసీఏ. దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యం తీవ్రత అధికంగా ఉందని, వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ ప్రాతంలో మతాబులు, పటాసులు పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.