తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో పర్యటించిన విదేశీ రాయబారుల బృందం - కశ్మీర్ పరిస్థితులు

స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో పరిస్థితులపై అధ్యయనం చేయటానికి దిల్లీలోని విదేశీ రాయబారుల బృందం నేడు శ్రీనగర్​కు చేరుకుంది. కశ్మీర్​లోని సైన్యం ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలతో చర్చించారు.

JK-ENVOYS
JK-ENVOYS

By

Published : Jan 10, 2020, 4:01 PM IST

జమ్ముకశ్మీర్​లో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి 16 దేశాల ప్రతినిధుల బృందం నేడు శ్రీనగర్​కు చేరుకుంది. సుమారు ఏడు గంటలపాటు శ్రీనగర్​లో పర్యటించిన నేతలు, ప్రజాసంఘాలు, సైన్యాధికారులతో భేటీ అయ్యారు.

పర్యటనలో భాగంగా కశ్మీర్​లోని పౌర సమాజ సభ్యులతో సమావేశమయ్యారు ప్రతినిధులు. పశ్చిమ పాకిస్థాన్​ శరణార్థులు, వాల్మీకి సమాజం, గుజ్జుర్లు, న్యాయవాదులను కలిశారు. కశ్మీర్​లోని రాజకీయ నేతలు, సైన్యం ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు.

అనుమతి నిరాకరణ

లోయలో పర్యటించేందుకు అధికారులు అనుమతివ్వలేదు. స్థానిక పరిస్థితులపై విదేశీ బృందానికి సీఎస్ బీవీఆర్​ సుబ్రమణ్యన్​, డీజీపీ దిల్​బాగ్​ సింగ్ వివరించారు. అధికరణ 370 రద్దు అనంతరం భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను తెలిపారు. వైద్య సదుపాయాలకు సంబంధించి ఆరోగ్యం, ఆర్థిక శాఖ కమిషనర్​ అతుల్​ దుల్లో వివరించారు.

ఇది రెండోసారి..

గతేడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత నుంచి అక్కడ విదేశీ ప్రతినిధులు పర్యటించటం ఇది రెండోసారి. గతంలో 23 మంది ఐరోపా సమాఖ్య ఎంపీలు సందర్శించి లోయలో పరిస్థితులను తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details