పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి.. వ్యర్థాలతో నిలువు హరితవనాలను సృష్టిస్తున్నారు జమ్మూకశ్మీర్‌కు చెందిన పర్యావరణవేత్త డాక్టర్ నాజియా రసూల్.
"నిలువు గార్డెన్లతో.. పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాదు. మొక్కలకు పోసే నీటిని వృథా కాకుండా చూడొచ్చు. స్థలం కూడా తక్కువ ఆక్రమిస్తుంది. ఓ సెమినార్లో పాల్గొన్నప్పుడే ఈ నిలువు గార్డెన్ల ఆలోచన వచ్చింది. నేను బోధిస్తున్న ప్రభుత్వ మహిళా కళాశాలలో మొదట ఈ ప్రయోగం చేశాను. ఆపై పోలీస్ పబ్లిక్ స్కూల్ వద్ద, జమ్ము వర్సిటీ గోడలపై సృష్టించాను. కరోనా కాలంలో ఒత్తిడిని పోగొట్టడానికి ఈ నిలువు గార్డెన్లు ఉపయోగపడతాయి. "
-డాక్టర్ నాజియా రసూల్ , పర్యావరణవేత్త
వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్ల మీద బొమ్మలు గీసి ఆకర్షణీయంగా మార్చేశారు నాజియా. వాటిలో మొక్కలు నాటి ఓ క్రమం ప్రకారం గోడకు అతికించారు. పై వరుసలో నీరు పోస్తే ఆ నీరు కింది వరుసకూ చేరుతుందంటున్నారు.