కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) కోరుతున్న విధంగా తాము ప్రధానమంత్రి ప్రత్యేక విమాన రాకపోకల సమాచారాన్ని వెల్లడించలేమంటూ దిల్లీ హైకోర్టులో భారత వాయుసేన (ఐఏఎఫ్) పిటిషన్ దాఖలు చేసింది. ఇది ప్రధాని భద్రతకు సంబంధించిన విషయమని ఐఏఎఫ్ తెలిపింది.
'అలా చేస్తే ప్రధాని భద్రతకే ముప్పు' - pm tour details in special flight iaf
ప్రధాని ప్రత్యేక విమాన ప్రయాణాల సమాచారాన్ని బహిర్గతం చేయలేమంటూ దిల్లీ హైకోర్టులో భారత వాయుసేన (ఐఏఎఫ్) పిటిషన్ దాఖలు చేసింది. పై సమాచారాన్ని కోరుతూ ఓ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ విధంగా స్పందించింది.
'ఆ వివరాలు బహిరంగపరచలేము'
ప్రధానితో పాటు ప్రయాణించిన బృంద వివరాలు, ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ) సిబ్బంది పేర్లు, ప్రధాని విదేశీ, స్వదేశీ పర్యటన సమాచారం కావాలని విశ్రాంత కమడోర్ లోకేశ్ బాత్రా సమాచార హక్కు చట్టం కింది దరఖాస్తు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.