తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫొని' విధ్వంసం నుంచి తేరుకోని ఒడిశా - puri

ఒడిశాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఫొని తుపానుతో జనజీవనం స్తంభించింది. తీరప్రాంతాల్లో మూడురోజులుగా నీరు, విద్యుత్​ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫొని బీభత్సానికి 35 మంది మృత్యువాతపడ్డారు.

ఒడిశాలో తుపాను విధ్వంసం

By

Published : May 7, 2019, 3:00 PM IST

ఒడిశాలో తుపాను విధ్వంసం

ఫొని తుపానుతో ఒడిశా తీరప్రాంతం అతలాకుతలమైంది. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణనష్టం తగ్గినా ఆస్తినష్టం భారీగా జరిగింది. తీర ప్రాంతాల్లో భారీ వృక్షాలు, సెల్​ టవర్లు​, విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి.

తుపాను తీవ్రత తగ్గి రోజులు గడుస్తున్నా.. చాలా ప్రాంతాల్లో నీటి సమస్య తీరలేదు. విద్యుత్ పునరుద్ధరణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఎన్డీఆర్​ఎఫ్, ఒడిశా విపత్తు నిర్వహణ దళాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఫొని విధ్వంసంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

నీరు-విద్యుత్

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నీరు, విద్యుత్​ సరఫరా నిలిచిపోయాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్​, ప్రఖ్యాత యాత్ర స్థలం పూరీలో వ్యవస్థల పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. అయితే... మానవ వనరుల కొరత ఇబ్బందిగా మారింది. కనీసం మరో 10వేల సిబ్బంది అవసరమని ఉన్నతాధికారుల అంచనా.

పూరీలో భారీ నష్టం

ప్రఖ్యాత పర్యటక స్థలం పూరీ.. ఫొని దెబ్బకు విలవిలలాడింది. తుపాను ధాటికి పట్టణంలో భారీగా నష్టం వాటిల్లింది. పూరీలోని దేవాలయాలు, మండపాలూ దెబ్బతిన్నాయి. రథయాత్ర సందర్భంగా యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెల్టర్లు ధ్వంసమయ్యాయి.

ప్రభుత్వ కార్యలయాల పరిస్థితి

రాష్ట్రంలో వందల సంఖ్యలో ప్రభుత్వ ఆస్తులూ ధ్వంసమయ్యాయి. ఇందులో 5,791 పాఠశాలలు, 1,031 వైద్యశాలలు ఉన్నాయి.

బాధితులకు సాయం

ఒడిశాలో విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రానికి మరో రూ.1000కోట్లు మంజూరు చేశారు. మరణించినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50వేల చొప్పున కేంద్రం సాయం ప్రకటించింది.

తుపాను విధ్వంసం దృష్ట్యా రూ. 17 వేల కోట్లు సహాయం అందివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్. తరచూ ప్రకృతి వైపరీత్యాల బారిన పడుతుండటం వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: ఒడిశాకు మరో రూ.1000 కోట్లు సాయం: మోదీ

ABOUT THE AUTHOR

...view details