దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు.. అధికారిక సమావేశాలను కొవిడ్-19 జాగ్రత్తలతో ప్రారంభించేలా చూడాలని సూచించింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ.
అధికారిక సమావేశాలకు ముందు కరోనాపై అవగాహన - అధికారిక సమావేశాలు
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అన్ని అధికారిక సమావేశాలను కొవిడ్-19 జాగ్రత్తలపై సందేశాలతో ప్రారంభించాలని సూచించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ. అధికారులు, సిబ్బందిలో కరోనా కట్టడిపై అవగాహన కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొంది.

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
ఈ సందేశాల్లో ప్రధానంగా మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం, చేతులు శుభ్రం చేసుకోవటం, కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై అవగాహన కల్పించనున్నారు.
ఇదీ చూడండి: తస్మాత్ జాగ్రత్త: పొగతాగేవారికి కరోనాతో అధిక ముప్పు