ఐక్యరాజ్య సమితి భద్రత మండలికి ఎన్నికైన వేళ కీలక విషయాలు వెల్లడించింది భారత్. యూఎన్ఎస్సీలో ఉగ్రవాద నిర్మూలన చర్యలను బలోపేతం చేయటం, తీవ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే అంశంపై రాజకీయాల ప్రభావం తగ్గించటం తమ ప్రాధాన్య అంశాలలో ప్రధానమైనవి స్పష్టం చేసింది. భద్రత మండలిలో ప్రాతినిధ్యం వహించని దేశాల గొంతుకని వినిపించేందుకు భారత్ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్.
" యూఎన్ఎస్సీలో ఉగ్రవాద నిర్మూలన చర్యలను బలోపేతం చేయటం మా ప్రాధాన్యాంశాల్లో ఒకటి. గతంలో 2011-12లో భద్రత మండలిలో సభ్యులుగా ఉన్నప్పుడు.. తీవ్రవాద నిర్మూలన కమిటీకి అధ్యక్షత వహించాం. సభ్య దేశాల్లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనన్న భావనను తీసుకొచ్చాం. 1996లో భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సును త్వరితగతంగా ఏర్పాటుకు కృషి చేస్తాం."