భూగోళంపై తలెత్తే సమస్యలను పరిష్కరించుకొనే దిశగా ప్రకృతిని తీర్చిదిద్దుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన వెంకయ్య.. ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కుంటోదన్నారు. అలాగే జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి మానవ ప్రయత్నాలను పెంచాల్సి మరింత అవసరం ఉందని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ పోరులో భాగంగా వాతావరణమే కాకుండా.. ఆహార భద్రత, నీటి సరఫరాలో మెరుగవ్వాలని సూచించారు వెంకయ్య.