తెలంగాణ

telangana

స్వచ్ఛత కోసం పిచ్చోడి అవతారమెత్తిన 'అభిమన్యు'డు

By

Published : Dec 15, 2019, 8:36 AM IST

తెలియనివారికి తానో పిచ్చివాడు, చెత్తకుప్పలనుంచి ప్లాస్టిక్​ను ఏరుకునేవాడు. అయితే.. అతని గురించి తెలుసుకుంటే కానీ తెలియదు ఎందరికో ఆదర్శమని. నిజంగా ఒడిశాకు చెందిన అభిమన్యు.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్లాస్టిక్​ రహిత సమాజాన్ని చూడాలనే కాంక్షతో... తన బంగారు భవిష్యత్తునే ఈ సమాజానికి అంకితం చేశాడు.

engineering_rk
స్వచ్ఛత కోసం 'పిచ్చోడు' అయిన ఇంజినీర్​!

స్వచ్ఛత కోసం పిచ్చోడి అవతారమెత్తిన అభిమన్యుడు

పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ఒడిశా బాలేశ్వర్​కు చెందిన అభిమన్యు. అందుకోసం ప్లాస్టిక్ ​చెత్త​ ఏరుకునే వ్యక్తి అవతారమెత్తి... రెండేళ్ల నుంచి విశేష ప్రచారం కల్పిస్తున్నాడు.

ఇంతకీ ఎవరితను?

అభిమన్యు ఒడిశా బాలేశ్వర్​ జిల్లా కన్హెబిందాకి చెందిన వాడు. రెండేళ్ల కితం ఇంజినీరింగ్​ విద్యను పూర్తిచేశాడు. అందరు యువకుల్లా ఓ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూడలేదు. బాధ్యత గల పౌరుడిలా సమాజానికి సేవనందించాలని ఆకాంక్షించాడు.

'సామాజిక సేవే' తన ఉద్యోగం, బాధ్యత అని భావించాడు. అప్పుడే పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్న ఆలోచన తన మదిలో మెదిలింది. అంతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ప్లాస్టిక్​ చెత్త​ ఏరుకునే వ్యక్తిలా, తనకు తాను ఓ వికృత ఆకారాన్ని తలపించే వేషధారణ సృష్టించుకున్నాడు. భుజాన సంచి వేసుకొని... రోడ్లపై కనిపించే ప్లాస్టిక్​ని ఏరుతూ అందరికీ దాని పట్ల అవగాహన పెంపొందిస్తున్నాడు. ప్లాస్టిక్​ వినియోగం వల్ల కలిగే నష్టాలనూ వివరిస్తున్నాడు.

ఒడుదొడుకుల ప్రయాణం...

ఈ రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను సైతం ఎదుర్కొన్నాడు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు అతనిపై విమర్శలు చేశారు. చీదరించుకున్నారు. పిచ్చోడన్నారు. అయినా తన పట్టుదల వీడలేదు. మొక్కవోని దీక్షలా, స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాను అనుకున్న లక్ష్యం దిశవైపు అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాడు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇదీ చూడండి : 'మా దగ్గర ఆ వస్తువు కొంటే కిలోన్నర ఉల్లి ఫ్రీ'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details