ప్రపంచంలోనే పొడవైన అటల్ టన్నెల్‌ను సందర్శించేలా విద్యార్థులను ప్రొత్సహించాలని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలకు సూచించింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఉత్తమ సాంకేతికతతో నిర్మితమైన, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ టన్నెల్ గురించి విద్యార్థులకు వివరించాలని పేర్కొంది. టన్నెల్ నిర్మాణంలో సాంకేతికత గురించి వివరిస్తూ.. విశ్వవిద్యాలయ ఉపకులపతులకు ఈమేరకు లేఖ రాశారు యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్.
"హిమాచల్ ప్రదేశ్‌లో కఠిన వాతావరణంలో సముద్రతలానికి 10 వేల అడుగుల ఎత్తులో 9.02 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించడం సులువైన పని కాదు. అంతేకాకుండా పర్యవేక్షణ వ్యవస్థ, ఎస్ఓఏడీఏ అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ, పర్యవేక్షణ వ్యవస్థతో సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఉత్తమ పద్ధతిలో నిర్మించారు" అని జైన్ పేర్కొన్నారు.