జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని మాల్‌బాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ తీవ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఓ సీఆర్పీఎఫ్ జవాను అమరుడయ్యారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం - Malbagh encounter
జమ్ముకశ్మీర్ మాల్‌బాగ్‌లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడిని హతమార్చారు భద్రతా సిబ్బంది. ఓ సీఆర్పీఎఫ్ జవాను అమరుడయ్యారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో శ్రీనగర్ నగర శివార్లలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. వీరిని చూసిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఫలితంగా ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు జమ్ముకశ్మీర్ డీజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
Last Updated : Jul 3, 2020, 12:36 AM IST