తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై ఎన్​కౌంటర్- ఆరుగురు అరెస్ట్ - encounter in up ithawa between sourabh gand and police

ఉత్తర్ ప్రదేశ్​లో ఆరుగురు దుండగులు అరెస్ట్ అయ్యారు. అర్ధరాత్రి వేళ మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై తిరుగుతున్న ముఠాను పక్కా సమాచారంతో.. మాటువేసి పట్టుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రోడ్డుపైనే కాల్పులు జరిగాయి.

encounter in up ithawa between sourabh gand and police
నడిరోడ్డుపై ఎన్​కౌంటర్-ఆరుగురు అరెస్ట్!

By

Published : Aug 24, 2020, 1:26 PM IST

ఉత్తర్ ప్రదేశ్ ఎటావా జిల్లా, బకేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి... సున్వర్షా బ్రిడ్జ్ సమీపంలో.. పోలీసులు, దుండగుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు..

ఆదివారం రాత్రి 11-1 గంట మధ్య పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు కొంత మంది అపరిచితులు ఆయుధాలతో రోడ్లపై సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురు కాల్పుల్లో ఆ ముఠాధిపతి సౌరభ్ కటేరియా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు..

దుండగుల దగ్గర నుంచి ఓ ఓమ్నీ కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. ఆ బైకు ఆగస్టు 19న స్థానిక అంజలీ ట్రేడర్స్ గుమాస్తా దగ్గర నుంచి దొంగలించినట్లు గుర్తించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు..

ఇదీ చదవండి: శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details