ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నందకూర్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది- నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఒడిశాలో ఎన్కౌంటర్- ఐదుగురు నక్సల్స్ హతం - ఆయుధాలు
ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటన కొరాపుట్ జిల్లా నందకూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఒడిశాలో ఎన్కౌంటర్- ఐదుగురు నక్సల్స్ హతం
15 మంది మావోయిస్టులు పడువా అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వారిని చూసిన నక్సలైట్లు కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన భద్రతా దళాలు ఐదుగురిని మట్టుబెట్టాయి. ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి: గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఆ కప్ ఇక కనిపించదు!