తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మారని పాక్​ తీరు

జమ్మూ కుప్వారాలో భద్రతా బలగాలకు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అటు.. నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్​ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది.

జమ్మూ కుప్వారా

By

Published : Mar 1, 2019, 9:57 AM IST

జమ్మూ కుప్వారా జిల్లాలో హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి తారస పడ్డారు ఉగ్రవాదులు. వెంటనే కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. నక్కి ఉన్న ఉగ్ర వాదుల కోసం పరిసరాలను జల్లెడ పడుతున్నాయి బలగాలు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ సైన్యం మరోసారి ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ యురి సెక్టార్‌లోని కామల్‌కోట్‌ ప్రాంతంలో పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్‌ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ కాల్పులు రాత్రంతా జరిగినట్లు సైనిక అధికారులు తెలిపారు.

కుప్వారాలో ప్రస్తుత పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details