తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్ర ఏరివేత- ముగ్గురు ముష్కరులు హతం - కశ్మీర్ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతం

ENCOUNTER
ఎన్​కౌంటర్​

By

Published : Jun 29, 2020, 4:46 AM IST

Updated : Jun 29, 2020, 7:10 AM IST

06:23 June 29

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్​నాగ్​ జిల్లాలోని ఖుల్చోహార్​ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరి నుంచి ఓ ఏకె రైఫిల్,  రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముష్కరులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఖుల్చోహార్ ప్రాంతంలో ముష్కర మూకలు నక్కి ఉన్నాయన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు తీవ్రవాదులు. అది ఎన్​కౌంటర్​కు దారితీసింది. ప్రస్తుతం ఆపరేషన్​ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

05:36 June 29

జమ్ము కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

04:37 June 29

జమ్ము కశ్మీర్​ అనంత్​నాగ్​లో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్​నాగ్​ జిల్లాలోని ఖుల్చోహార్​ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

ఖుల్చోహార్ ప్రాంతంలో ముష్కరమూకలు నక్కి ఉన్నాయన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు తీవ్రవాదులు. అది ఎన్​కౌంటర్​కు దారితీసింది. ప్రస్తుతం ఆపరేషన్​ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

Last Updated : Jun 29, 2020, 7:10 AM IST

For All Latest Updates

TAGGED:

Encounter

ABOUT THE AUTHOR

...view details