జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు పంజా విసిరాయి. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో వీరిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - షోపియాన్ ఎన్కౌంటర్ ఇద్దరు మష్కరులు హతం
జమ్ము కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు.
'లాంచ్ప్యాడ్ల వద్ద 300 మంది ఉగ్రవాదులు'
ఉగ్రవాద కదలికలపై అందిన సమాచారంతో జిల్లాలోని కుత్పొరా ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని అధికారులు వెల్లడించారు. బలగాలను గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డాయని తెలిపారు. దీంతో భద్రతా దళాలు సైతం దీటుగా స్పందించినట్లు చెప్పారు. మృతి చెందిన ఇద్దరు ముష్కరులను గుర్తించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి-'లాంచ్ప్యాడ్ల వద్ద 300 మంది ఉగ్రవాదులు'