జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. వీరిని జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో ఒకరు పాకిస్థాన్ వాసి అని అధికారులు వెల్లడించారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో తెల్లవారుజామున భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాల రాకను గమనించిన ముష్కరులు ఉదయం 6.40 గంటల సమయంలో కాల్పులకు తెగబడ్డారు. దీటుగా తిప్పికొట్టిన సైనిక సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.