రేబాన్ ప్రాంతంలో భద్రతా దళాలు.. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన అనంతరం జమ్ముకశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు ముష్కురులు హతమయ్యారు. వారి దగ్గర్నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
కశ్మీర్లో 'ఉగ్ర' ఏరివేత.. నలుగురు ముష్కరులు హతం - jammu kashmir
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్లోని పింజోరాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.
కశ్మీర్లో 'ఉగ్ర' ఏరివేత.. షోపియాన్లో ఎన్కౌంటర్
షోపియాన్లోని పింజోరాలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. ఎన్కౌంటర్కు దారితీసింది.
షోపియాన్ జిల్లాలో గత 24 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్.
Last Updated : Jun 8, 2020, 11:57 AM IST