కశ్మీర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
కశ్మీర్లోని కుల్గాం జిల్లా వాన్పొరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.