కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం.. దేశంలో టీకాను అత్యవసరంగా వినియోగించేందుకు కావాల్సిన అనుమతులపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
ప్రస్తుతం.. వ్యాక్సిన్ క్యాండిడేట్లపై క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉందని ఆన్లైన్ కార్యక్రమం 'సండే సంవాద్'లో పేర్కొన్నారు హర్షవర్ధన్.
"వ్యాక్సిన్ను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతులు ఇవ్వాలంటే.. దాని భద్రత, సమర్థతకు సంబంధించి కచ్చితమైన డేటా అవసరం ఉంది. రోగి భద్రత కోసం ఇది ఎంతో ముఖ్యం. అందుబాటులోకి వచ్చే డేటా ఆధారంగానే తదుపరి కార్యచరణ ఆధారపడి ఉంటుంది."
--- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యమంత్రి.