తెలంగాణ

telangana

'కరోనాపై భయాన్ని తొలగించి.. అవగాహన కల్పించండి'

దేశంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో పాత్రికేయులకు పలు సూచనలు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వైరస్​ విషయంలో ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. కొవిడ్​ బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు వెంకయ్య.

By

Published : Aug 16, 2020, 6:46 AM IST

Published : Aug 16, 2020, 6:46 AM IST

Eliminate Corona Fear and Promote Precautions: M Venkaiah Naidu
'కరోనాపై భయాన్ని తొలగించి.. జాగ్రత్తలపై ప్రచారం చేయండి'

కరోనా విషయంలో ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. పాత్రికేయులకు సూచించారు. ఇందుకు సంబంధించిన వార్తల్లో సంచలనాలు, అతిశయోక్తులు జోడించొద్దని కోరారు. వైరస్​ బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

కరోనా సమయంలో దిల్లీలోని తెలుగు పాత్రికేయుల యోగక్షేమాలు తెలుసుకొనేందుకు ఆయన శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అందరితో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు సెప్టెంబరులోపు ఉంటాయని.. అందుకు తగ్గ ఏర్పాట్ల గురించి లోక్‌సభ స్పీకర్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. అయోధ్య సందేశం సయోధ్యే అని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:ఇంటి మిద్దెపై విమానం.. ఔత్సాహికుడి ఘనత

ABOUT THE AUTHOR

...view details