కేరళలో మృతిచెందిన ఏనుగు.. పైనాపిల్ బాంబును ప్రమాదవశాత్తు ఆరగించి ఉండొచ్చని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అడవి పందుల బారి నుంచి తమ పొలాలను రక్షించుకోవడానికి స్థానికులు ఈ తరహా విస్ఫోటాలతో అక్రమ చర్యలకు పాల్పడుతుంటారని గుర్తించినట్టు వివరించింది.
"ఆ పండును ఏనుగు ప్రమాదవశాత్తు ఆరగించి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేరళ ప్రభుత్వాన్ని పర్యావరణశాఖ నిరంతరం సంప్రదిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన ఇతరులను పట్టుకోవడానికి కృషి చేస్తున్నారు."
--- పర్యావరణమంత్రిత్వ శాఖ ట్వీట్.